yesu raju ga vachuchunnadu song lyrics:
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు (2)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చు చున్నాడు (2) (యేసు)
1.మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం (యేసు)
2.ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్ (2)
వాక్యమే కరువగును (యేసు)
3.వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లును (2)
న్యాయమే కనబడును (యేసు)
4.ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
వంగని మోకాళ్ళన్నీ (2)
యేసయ్య యెదుట వంగిపోవును (యేసు)
5.క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి (2)
యేసయ్య చెంతకు చేరాలి (యేసు)
No comments:
Post a Comment